
ప్రస్తుతం తెలుగులో బిజీబిజీగా గడుపుతోన్న సంగీత దర్శకుడు ఎవరు అంటే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అని టక్కున చెప్పొచ్చు. స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలకూ దేవీశ్రీనే ఫస్ట్ ఆప్షన్. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. వాటిలో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. అదేంటంటే దర్శకుడు అనిల్ రావిపూడి, దేవీశ్రీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట.దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్స్ అనిల్ రావిపూడికి నచ్చడం లేదని ఒక రూమర్ బాగా వైరల్ అవుతోంది. ఏ ట్యూన్ ఇచ్చినా ఇంత కన్నా బెటర్ కావాలని దేవీని అనిల్ అడుగున్నారట. ఆర్మీ బ్యాక్ డ్రాప్లో తీస్తున్న సినిమా కాబట్టి, గత చిత్రాల మాదిరి కాకుండా ట్యూన్స్ కొత్తగా ఉండాలని పదే పదే దేవీని అనిల్ అడుగుతున్నారని టాక్. అయితే, అనిల్ ఎంత తలబాదుకుంటున్నా దేవీ మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారని ఇండస్ట్రీకి చెందిన కొంత మంది అంటున్నారు. మరి, దీనిలో నిజమెంతో తెలియాల్సి ఉంది.