
మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినీ కెరియర్ లో ప్లాప్స్ ఎక్కువ అని చెప్పక తప్పదు. ఒక హిట్ వస్తే రెండు ప్లాప్స్ ఎదురుకోవాల్సి వచ్చింది. అయినా సరే డీలా పడకుండా తనకు సెట్ అయ్యే కథలను ఎంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా నటించిన చిత్రలహరి తేజ్ కు కాస్త ఊరటను ఇచ్చింది. యూత్ ను ఆకట్టుకునే మ్యూజిక్, కధతో మెప్పించాడు. ఇక ఇప్పుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. సాయిధరమ్ కు జతగా రాశిఖన్నా నటిస్తుంది. ఈ సినిమాకు 'ప్రతిరోజు పండగే' అనే టైటిల్ ను ఎంపిక చేసుకుంది. ఈ టైటిల్ తో మారుతి అభిమానుల మనసులు గెలుచుకున్నారు. తాజాగా టైటిల్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పండగ లాగా సాగే ఈ పాట ఎంతో సరళంగా, సింపుల్ గా ఉంది. ట్యూన్ రొటీన్ గా ఉన్న పర్వలేదనిపించింది. మరి మారుతి అన్ని ఎమోషన్స్ ను చూపించడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.