
రెబల్ స్టార్ ప్రభాస్ ను బాహుబలికి ముందు... బాహుబలికి తర్వాత అని పోల్చడంలో తప్పు లేదేమో. బాహుబలికి ముందు ప్రభాస్ కేవలం సౌత్కె పరిమితమయ్యాడు. కానీ బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్ వైడ్ క్రేజ్ రావటమే కాకుండా నార్త్ లో ప్రభాస్ స్టార్ హీరో జాబితాలో చేరిపోయాడు. ప్రభాస్ తాజాగా నటించిన సాహో సౌత్ లో అంత మెప్పించలేకపోయింది. కానీ నార్త్ తో బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ప్రభాస్ సౌత్ లో సాహో రిజల్ట్ ను చూసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తన తదుపరి సినిమా అయినా 'జాన్' కు ఎంత అవసరమైతే అంతే బడ్జెట్ పెట్టాలని నిర్మాతలకు సూచించాడట. ఈసారి ఎలాగైనా సౌత్ ప్రేక్షకులను మెప్పించాలని తనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయటపెడ్తున్నాడు. సాహో జరుగుతున్నప్పుడే జాన్ చిత్రాన్ని ప్రారంభించాడు...తర్వాత సాహో ప్రమోషన్స్ లో బిజీగా ఉండి దీనికి బ్రేక్ ఇచ్చాడు. ఇక సాహో రిజల్ట్ తో రెబల్ స్టార్ ఆలోచనలు కూడా మారాయి. అనవసరమైన బడ్జెట్ పెట్టకూడదని నిర్మాతలకు చెప్పి...యూరోప్ లో జరగాల్సిన సెకెండ్ షెడ్యూల్ ను క్యాన్సిల్ చేయించి..రామోజీ ఫిల్మ్ సిటీలో చేయవలసిందిగా దర్శకనిర్మాతలకు చెప్పాడట. మొత్తానికి బడ్జెట్ విషయంలో ప్రభాస్ గట్టి జాగ్రత్తలే తీసుకుంటున్నాడు.