
Pavan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపించి చాలా రోజులే అయింది. ఆయన పేరు వినిపిస్తే చాలు పూనకంతో ఊగిపోయేవారు ఎందరో. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన పవన్ ను మళ్ళీ తెరపై చూడాలనే కోరిక, కోరికగానే మిగిలిపోతుందేమో అని డీలా పడ్డ అభిమానులను ఆయన రీ ఎంట్రీ వార్త కొత్త ఉత్సాహాన్ని ఆనందాన్ని తెచ్చింది. హిందీలో భారీ విజయం సాధించిన 'పింక్' సినిమాను బోనీ కపూర్ తెలుగులో బడా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజుతో కలిసి నిర్మించాలనుకుంటున్నారు. ఇందులో ఓవన్ లిడ్ రోల్ చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్త హల్ చల్ చేస్తుంది. అయితే...అటు రాజకీయాలను ఇటు సినిమాను మ్యానేజ్ చేయటం అంత ఈజీ కాదు. పార్టీ నిలబడాలి అంటే డబ్బుతో పాటు పార్టీను చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే దీనికి పవన్ మంచి ప్లాన్ వేశారట. రోజులో కేవలం మూడు గంటలు మాత్రమే సినిమాకు కేటాయించి...మిగితా సమయం అంతా రాజకీయాలు చూసుకుంటారట. అంటే పవన్ రోజులో కేవలం మూడు గంటలు మాత్రమే మేకప్ వేసుకోనున్నారు.