
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో ది బెస్ట్ సినిమాగా నిలిచిన రంగస్థలం వసూళ్ల వర్షం కురిపించడమే కాక రామ్ చరణ్ కు యాక్టర్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది. రామ్ చరణ్ తో పాటు సినిమాలో ఎంతో ముఖ్యమైన పాత్ర రంగమ్మత్త పాత్ర పోషించిన అనసూయకు అంతే పేరు తెచ్చిపెట్టింది. అప్పటి వరకు గ్లామర్ పాత్రలకు మాత్రమే అనసూయను కన్సిడర్ చేసిన దర్శకనిర్మాతలు రంగమ్మత్తతో పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు కూడా సంపాదిస్తున్నారు. అయితే ఈ పాత్రకు అనసూయ మొదటి ఛాయిస్ కాదట. దర్శకుడు మొదట సీనియర్ నటి రాశీని అడిగారట. ఈ విషయం గురించి తాజాగా అలీతో జాలిగా షోలో ప్రస్తావించింది రాశీ. ఆమెను చేయమని అడగగా....పాత్ర నచ్చినప్పటికి పాత్రలో మోకాళ్ల మీదకు చీర కట్టడం ఇష్టం లేకనే ఈ పాత్రను రిజెక్ట్ చేసినట్టు చెప్పింది. కానీ పాత్ర మిస్ అయినందుకు తనకేమీ బాధలేదని స్పష్టం చేసింది.