
సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా (83) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం కోల్కత్తాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 2004-2014 మధ్య కాలంలో ఆయన లోక్సభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభకూ పలుమార్లు ఎన్నికయ్యారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ (ఏఐటీయుసీ) ప్రధాన కార్యదర్శిగా గురుదాస్ దాస్గుప్తా సేవలు అందించారు. దాస్గుప్తా మరణంపై సీపీఐ జాతీయ కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.