
సినిమా ఇండస్ట్రీలోకి ఎంతమంది వచ్చినా మెగాస్టార్ మెగాస్టారే. అలానే బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు వచ్చినా సుమ స్థానం సుమదే. అందమైన యాంకర్లు వచ్చి ఎంత గ్లామర్ షో చేసినా ఆమెను మాత్రం బిట్ చేయలేకపోతున్నారు. హీరోయిన్లు అయినా బోర్ కొడ్తారేమో కానీ సుమ మాత్రం బోర్ కొట్టదు. కేరళ నుంచి వచ్చి తెలుగు నేర్చుకోని బుల్లితెరపై రఫ్ ఆడిస్తుంది. ఛానల్స్, ఆడియో ఫంక్షన్స్, ఇంటర్వ్యూస్ ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్ ఇలా ప్రతీదాంట్లో కనిపిస్తూ ప్రేక్షకులను రెండు దశాబ్దాలగా ఎంటర్టైన్ చేస్తుంది. అయితే ఇమే హీరోయిన్స్ కన్నా ఎక్కువ సంపాదిస్తుందన్న టాక్ జోరుగా వినిపిస్తుంది. ఆమె సంపాదన రోజుకు లక్షల్లో నెలకు కోట్లలో ఉంటుందని సమాచారం. తాజాగా సుమ రెమ్యునరేషన్ పై సుమ భర్త రాజీవ్ కనకాల క్లారిటీ ఇచ్చారు. సుమ ఈ స్థాయిలో ఉండడానికి కారణం మరెవరో కాదు సుమనేనని అన్నారు. రోజుకు 8గంటల పాటు లైట్స్ లో ఉండడం నిల్చోనే మాట్లాడడం అంత ఈజీ కాదని తెలిపారు. ఇకపోతే సుమ రెమ్యునరేషన్ మీరు ఉహించుకునే అంత ఉండదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే లక్షల్లో తీసుకుంటుందటారు కానీ ఎన్ని లక్షలు తీసుకుంటుందనేది మాత్రం తెలియదు అంటున్నాడు. సుమ ఎంత సంపాదిస్తుందో రాజీవ్ కు కూడా తెలియకపోవడం ఆశ్చర్యంగా లేదు ?