
తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలపై ఎప్పుడు ఐటీ దాడులు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి. పన్ను సరిగ్గా కడితే ఎటువంటి బాధ, భయం అవసరం లేదు. కట్టపోతేనే ఊసలు లెక్కిపెట్టేవరకు వెళ్తుంది వ్యవహారం. తాజాగా అలానే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ బాబు, పలు హీరోల కార్యాలయలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు అకస్మాత్ తనిఖీలు చేశారు. కొన్నేళ్లుగా సురేష్ బాబు రామానాయుడు స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ కు సంబంధించిన పత్రాలను సరైన సమయంలో అందచేయనందున్న ఈ ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలియచేశారు. ఈ సోదాల్లో సురేష్ బాబు కార్యాలయాల్లోని కొన్ని కీలక పత్రాలను హార్ట్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సురేష్ బాబు కార్యాలయాలపై సోదాలు మొదలు పెట్టిన అధికారులు తర్వాత హీరో నాని ఇంటిపై, ఆఫీస్ పై చేయనున్నారని సమాచారం. అలానే హారిక అండ్ హసీని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయాలపై కూడా తనిఖీలు నిర్వహించనున్నారు.