
పవన్ రీఎంట్రీపైన రోజుకో అప్డేట్ వస్తున్నప్పటికీ కచ్చితంగా వస్తున్నాడనే కన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే...పవన్ కానీ, అతను చేస్తున్న సినిమా దర్శకనిర్మాతలు కానీ నోరు విప్పి చెప్పలేదు. అయితే ఇన్ని వార్తలు వస్తున్న పవన్ ఖండించట్లేదంటే రీఎంట్రీ పక్క అని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "పింక్" సినిమాను తెలుగులో దిల్ రాజు రీమేక్ చేయనున్నారు. అందులో పవన్ నటించనున్నారు. మొన్నీమధ్యే దిల్ రాజు ఆఫీస్ లో సినిమా ప్రారంభం అయింది. జనవరిలో రెగులర్ షూటింగ్ మొదలు కానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే దర్శకుడు క్రిష్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పుడు సినీ సిర్కిల్స్ లో అందుతున్న సమాచారం మేరకు డైరెక్టర్ పూరి జగన్నాధ్ పవన్ ను కలిసారట. పూరి చెప్పిన లైన్ నచ్చడంతో కమిటీ అయిన సినిమాలు పూర్తి కాగానే మీతో చేస్తానని మాటీచ్చారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాల్సి ఉంది.