
విజయ్ దేవరకొండ, ఇప్పుడు ఈ పేరు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అటు బాలీవుడ్లో కూడా పరిచయం అవసరం లేని పేరు. స్టార్ హీరో, హీరోయిన్ల దగ్గర నుండి ఇప్పుడిప్పుడే వస్తున్న నటుల వరకు అందరికి సూపరిచితుడే విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో తన స్టేటస్ మారిపోయింది. ఇక అప్పటి నుంచి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నాడు. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ విజయ్ లు ఈమధ్యకాలంలో బాగా టచ్ లో ఉంటున్నారు. దీంతో వీరి కాంబోలో సినిమా రాబోతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన పార్టీలో బీ టౌన్ తారలతో కలిసి విజయ్ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పార్టీలో అలియా భట్, అర్జున్ కపూర్, జాక్లిన్ తదితరులతో విజయ్ దేవరకొండ ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వరల్డ్ ఫెమస్ లవర్" లో నటిస్తున్నాడు.