
హర్యానాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల ప్రచార సభపై గందరగోళం నెలకొంది. గతంలో ప్రకటించిన ప్రకారం మహేంద్రగర్ సభలో సోనియా పాల్గొనాల్సి ఉంది. అయితే సోనియా హాజరుకావడం లేదంటూ.. శుక్రవారం తమ అధికారిక ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ ప్రకటించింది. సోనియా స్థానంలో ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ హాజరవుతారని తెలిపింది. అయితే మరికొద్ది సేపటికి ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. దీంతో ఆమె హాజరుపై సందిగ్ధత ఏర్పడింది. హర్యానాలో ఈ నెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.