
నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన 'బిగ్ బాస్ సీజన్ 3' గ్రాండ్ ఫైనల్ భారీ తారాగణం మధ్య ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పటి వరకు జరిగిన రెండు సీజన్లు ఒక ఎత్తు...ఈ సీజన్ ఒక ఎత్తు అనేటట్టుగా జరిపారు నిర్వాహకులు. రాశిఖన్నా, అంజలీ, శ్రీకాంత్, నిధి అగర్వాల్, క్యాథరీన్ ఇలా తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు స్టేజ్ ఎక్కి ప్రేక్షకులను అలరించారు. ఇక బిగ్ బాస్ సీజన్ 3 విజేతను ప్రకటించేందుకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి రావడం విశేషం. ఏదో వచ్చి...విన్నర్ ను అనౌన్స్ చేయటమే కాకుండా ఇంటి సభ్యులతో మాట్లాడి... వాళ్ళపై చురకలు కూడా వేశారు. స్టేజ్ మీద ఉన్న కాసేపు తన పంచులతో, సెటైర్లతో అలరించారు. ఇక ఈ క్రమంలో హేమ వంతు రాగానే...ఆమె నా అభిమాన హీరోలు ఒకే స్టేజ్ పై కనిపించడం ఆనందంగా ఉంది అనగానే చిరు సరదాగా....ఏదో నాపై గౌరవంతో అంటున్నావు కానీ నీకు నాగ్ అంటేనే ఇష్టం, క్రష్ అని తెలుసులే అంటూ పంచ్ వేశారు. దానికి హేమ ఏం మాట్లాడా తెలియక కూర్చుండి పోయింది.