
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది మొదట్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా కరోనా కారణంగా ఆలస్యం కానుంది. మొన్నటి వరకు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన కొరటాల అండ్ టీం తాజాగా మళ్ళీ తిరిగి ప్రారంభించారు. మెగాస్టార్ కూడా సెట్స్ లోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ సమీపంలో ఉన్న కోకాపేట లో 16 ఎకరాల్లో స్పెషల్ గా వేసిన సెట్స్ లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. అది ఆ సెట్స్ ఒక సాంగ్ కోసమని తెలుస్తుంది. అందులో కాజల్ షూటింగ్ కి రాలేదు కాబట్టి అది చిరు ఎంట్రీ సాంగ్ అయుంటుందని అంచనా. అయితే ఈ సెట్స్ కు మొత్తంగా 20 కోట్లు ఖర్చు చేశారట. ఒక్క ఎంట్రీ సాంగే ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఏ లెవల్ లో ఉంటుందో. 20 కోట్లు అంటే ఒక మీడియం రేంజ్ హీరో సినిమా తీసేయొచ్చని సోషల్ మీడియాలో జోక్‌లు వేస్తున్నారు.