
యువ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం 'ఫైటర్'తో బాలీవుడ్ లో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ మసాలా హిట్ ఇచ్చిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, విజయ్ దేవరకొండపై సుదీర్ఘ షెడ్యూల్‌ను చిత్రీకరించడానికి ముంబైలో 5 కోట్ల రూపాయల భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సినిమా మేకర్స్ హీరోయిన్ గా బీ టౌన్ ముద్దుగుమ్మ అనన్య పాండేను తీసుకున్నారని సినీ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. హిందీలో ఫైటర్ సినిమాను ప్రజెంట్ చేస్తున్న కరణ్ జోహార్ విజయ్ దేవరకొండ బీ టౌన్ ఎంట్రీ గ్రాండ్ గా ఉండేటట్లు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం, అనన్య పాండే వరుస సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా సినిమా షూటింగ్ లో ఆలస్యంగా భాగమవుతుందని వినికిడి. మరోవైపు, విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'వరల్డ్ ఫెమస్ లవర్' ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.