
మాస్ మహారాజ రవితేజ రాబోయే చిత్రం రమేష్ వర్మ దర్శకత్వంలో రానుంది. ప్రస్తుతం 'క్రాక్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణను ముగించిన తరువాత, రవితేజ రమేష్ వర్మ దర్శకత్వ వెంచర్ సెట్స్‌లో చేరనున్నట్లు వినికిడి. అయితే రమేష్ వర్మ తెరకెక్కించనున్న సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే లేదా కియారా అద్వానీను పరిశీలిస్తున్నారు. వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కియారా అద్వానీ చేతిలో పలు బాలీవుడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మరి రవితేజ చిత్రానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచి చూడాలి. ఆమె బిజీ షూట్ షెడ్యూల్ కారణంగా విజయ్ దేవరకొండ సినిమాను కూడా తిరస్కరించిన విషయం తెలిసిందే. మరోవైపు, పూజా హెగ్డే ఇటీవల నటించిన అల..వైకుంఠపురములో విజయాన్నీ ఆస్వాదిస్తుంది. దీనిలో ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ప్రస్తుతం ఆమె జాన్ లో ప్రభాస్ తో రొమాన్స్ చేస్తోంది. రవితేజతో- కియారా అద్వానీ లేదా పూజా హెగ్డేలలో ఎవరు రొమాన్స్ చేస్తారో వేచి చూడాలి మరి.