
అక్కినేని జంట నాగచైతన్య, సమంత సందు దొరికిన ప్రతిసారి గోవాకు వెళ్లిపోతుంటారు. సమంతకు గోవా అంటే మహా ఇష్టమట. అందుకే ఎప్పుడూ కుదిరితే అప్పుడు వెళ్లిపోతుంటారు. పెళ్లి అక్కడ చేసుకోవడమే కాకుండా పెళ్లిరోజును కూడా అక్కడే జరుపుకుంటారు ఈ జంట. అంతేకాదు వీరి పుట్టిన రోజులకు, న్యూ ఇయర్ పార్టీలకు ఇలా సంధర్భం ఏదైనా సరే గోవాలో సెలబ్రెట్ చేసుకునేందుకు ఇష్టపడుతారు. అయితే ఎప్పుడూ గోవా వెళ్లిన ఫోటోలు పోస్ట్ చేసి అందరికి తెలిసేలా చేసే సామ్ ఈసారి మాత్రం గుట్టుచప్పుడు కాకుండా వెళ్ళొచేసింది. దానికి కారణం ఉందని తెలుస్తోంది. గోవాలో సముద్రం దగ్గర సొంత ఇల్లు కట్టుకునేందుకు స్థలం తీసుకుందని..ఆ ఇల్లు కన్స్ట్రేక్షన్ పనులు చూసుకునేందుకే భార్య భర్తలు తరచు వెళ్లి వస్తున్నారని తెలుస్తోంది. సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత గోవాకే వెళ్లి ఉండిపోవాలనే ఆలోచన సమంతకి ఉందని చెబుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందొ తెలియాలి అంటే సమంత నోరు విప్పాల్సిందే.