
తెలుగు చలన చిత్ర ఇండస్ట్రీ దర్శకుల్లో రాజమౌళి స్థానమే ప్రత్యేకమే. 2001 లో విడుదలైన మొదటి సినిమా "స్టూడెంట్ నెం.1" నుంచి బాహుబలి వరకు ఆకట్టుకునే కదాంశం, కట్టిపడేసే స్క్రీన్ ప్లే జక్కన్న స్పెషాలిటీ. రాజమౌళి 18ఏళ్ల జర్నీలో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ లేకుండా 11 బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాడంటే రాజమౌళి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ బడా హీరోలు యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇద్దరు హీరోల, అభిమానులు, రాజమౌళి ఫ్యాన్స్ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అందుకే ఇంత హైప్ ఉన్న సినిమాను కొనుకునేందుకు ఎన్ని కోటలైనా పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు వెస్ట్ గోదావరి ఆర్ఆర్ఆర్ హక్కుల కోసం గీతా అండ్ శన్ముఖ్ సినిమాస్ వారు రూ. 13కోట్లు చెల్లించారని తెలుస్తోంది. దీని ప్రకారం ఆర్ఆర్ఆర్ అన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయంగా అనిపిస్తుంది.