
నాగ చైతన్య మరియు సాయి పల్లవి నటిస్తున్న యూత్ ఫుల్ డ్రామా 'లవ్ స్టోరీ' నుంచి మేకర్స్ ఈ రోజు మొదటి సింగిల్ ‘ఏ పిల్లా’ అంటూ ఒక నిమిషం పాటు సాగే సంగీతాన్ని వాలెంటైన్స్ డే స్పెషల్గా విడుదల చేశారు. చై మరియు సాయి పల్లవిలను కలిగి ఉన్న ఏ పిల్లా మ్యూజికల్ ప్రివ్యూ హాయిగా సాగుతూ, మధురమైన భావన అందిస్తుంది. చై, సాయి పల్లవిల మధ్య కెమిస్ట్రీని మాస్టర్ స్టోరీటెల్లర్ శేఖర్ కమ్ముల అందంగా ప్రదర్శించారు. చివరలో 'ముద్దు పెడితే, ఏడుస్తారా ?' అని సాయి పల్లవి డైలాగ్ చెప్పే సన్నివేశం ఇందులో హైలైట్ గా నిలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. లవ్ స్టోరీ ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. శేఖర్ కమ్ముల 'ఫిదా' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన తర్వాత 'లవ్ స్టొరీ' తో వస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.