
సోషల్ మీడియా పుణ్యమా అని తమ హీరోల జీవితాల్లో ఎం అవుతుందో, వాళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు చూసే అవకాశం దక్కుతుంది. తాజాగా అలా ఓ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. హీరో సుమంత్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్లాష్ బ్యాక్ ఫ్రైడే అంటూ ఒక ఫోటోను పోస్ట్ చేసాడు. ఆ ఫోటోలో హీరో చిరంజీవితో పాటు దర్శకుడు జయంత్ సి పరాంజి ఉన్నారు. అంతేకాదు హీరో మహేష్ బాబు, ప్రభాస్, సుమంత్, తరుణ్, శ్రీకాంత్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కూడా ఉన్నారు. ఇది 20 ఏళ్ల నాటి ఫోటో. దర్శకుడు జయంత్ చిరంజీవితో బావగారు బాగున్నారా, శంకర్ దాదా ఎంబీ బీఎస్సినిమాలు తీశారు. ప్రభాస్ ను ఈశ్వర్ సినిమాతో పరిచయం చేసింది కూడా ఈయనే. ఇక మహేష్ ను తక్కరి దొంగగా మార్చింది జయంతే. ఆ సమయంలో తీసిన ఈ ఫోటో సుమంత్ పోస్ట్ చేయడంతో ఇప్పుడు వైరల్ గా మారింది. స్టార్ హీరోలందరు ఒకే ఫ్రెమ్ లో కనిపిస్తున్న ఈ ఫోటో చూసి నెటిజన్లు తెగ లైకులు, షేర్లు చేస్తున్నారు.