
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా నటించిన 'అల...వైకుంఠపురములో' సినిమాలోని పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ క్యాబ్ ఎక్కినా, ఏ ఫంక్షన్ కు వెళ్లినా, పెద్దోలైనా, చిన్నోలైనా ఇవే పాటలు. ప్రస్తుతం తెలుగులో ఉపుతున్న పాటలు 'సామజవరగమన', 'రాములో రాముల'. ఇవి యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ముందుగా రిలీజ్ అయిన సామజవరగమన పాటకు 1.2మిలియన్ లైక్స్ రాగా ఆ తర్వాత రిలీజ్ అయిన రాములో రాముల పాటకు తాజాగా 1మిలియన్ లైక్స్ వచ్చాయి. 146 వ్యూస్ తో 1 మిలియన్ లైక్స్ తో ఈ పాట సరికొత్త రికార్డులను సృష్టిచినట్లే. ఇక పాటలకు ఎంత ఆదరణ వచ్చిందో సినిమాకు కూడా అదే స్థాయిలో ఆదరణ లభించింది. జనవరి 12న రిలీజ్ అయిన సినిమా హిట్ టాక్ తో భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది.