
ప్రముఖ బుల్లితెర యాంకర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ భరద్వాజ్ కు ట్విట్టర్లో అసభ్యకరమైన కామెంట్లు ఎదురయ్యాయి. కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫాం వారి నిబంధనల ఉల్లంఘనను పాటించలేదు. యాక్టర్స్ మసాలా పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ చేస్తున్న అతను అనసూయ భరద్వాజ్ పై అసభ్యకర వ్యాఖ్యలను పోస్ట్ చేశాడు. అనసూయ గురించే కాక ఇతర తెలుగు నటిమణులను కించపరిచే విధంగా పోస్ట్లు పెడుతున్న ఆ ట్విట్టర్ ఖాతా గురించి అనసూయ ఫిర్యాదు చేసింది. కానీ ట్విట్టర్ ఆమెకు షాక్ ఇచ్చింది. అనసూయ చేసిన ఫిర్యాదుకు సమాధానంగా, కంటెంట్ వారి ఉల్లంఘన పరిధిలో లేదని పేర్కొంది. అనసూయ భరద్వాజ్ ట్విట్టర్ ఇచ్చిన సమాధానంపై స్పందిస్తూ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తన నిబంధనలను పూర్తిస్థాయిలో పరిశీలించి, ఇలాంటి సంఘటనల నుండి మహిళలను రక్షించాలని కోరారు.