
క్లాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాను ఇప్పుడు కాపీ వివాదం చుట్టుముట్టింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కొన్ని రోజులకు పలు రచయితలు ఆచార్య కధ తమ నుంచి కాపీ కొట్టారంటూ కొరటాల అండ్ టీంకు పెద్ద తలనొప్పిగా మరారు. ఈ రభస గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగడంతో చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఒక ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. 'ఇది అక్షరాలా కొరటాల శివ రాసుకున్న సొంత కధ. కేవలం ఒక మోషన్ పోస్టర్ ను చూసి ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఆ ఆరోపణల్లో ఎంతమాత్రం నిజంలేదని, షూటింగ్ పూర్తి చేసి త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని' స్టేట్మెంట్ లో పేర్కొంది.