
మూవీ మారథాన్ మొదలవుతుంది. ఫిబ్రవరి నెల నుంచి ఈ ఏడాది చివరి వరకు వరుసపెట్టి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద క్లాష్ అవుతున్నాయి. అందులో మెగాస్టార్ కొరటాల కాంబోలో వస్తున్న 'ఆచార్య' , వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబోలో వస్తున్న 'నారప్ప'. దేనికదే ప్రత్యేకం, ఎవరికీ వారే గొప్ప నటులు. కానీ ఇక్కడ పరీక్ష ప్రేక్షకులకే, ఇద్దరి ఫ్యాన్ బేస్ ఎక్కువే మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎవరి ఫ్యాన్స్ ఎవరి హీరోను కమర్షియల్ గా గెలిపిస్తారో చూడాలి. సినీ ప్రేమికులు మాత్రం కథ బాగుంటే చాలు చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ చూస్తారు. కాబట్టి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేదానికన్నా రెండు సినిమాలు కథలు బాగుండాలి జనాలు మెచ్చి హిట్ అవ్వాలి అని కోరుకుందాం.