
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'ఆచార్య' షూటింగ్ మొదలవ్వకముందే కరోనా మహమ్మారి రావటం, దేశమంతా మూడు నెలల పాటు లాక్డౌన్ కు వెళ్లడంతో ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. సరే మళ్ళీ అన్ని యధావిధిగా మొదలయ్యాయి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చూసుకుంటున్నారని ఆచార్య టీం కూడా షూటింగ్ కు సిద్దమవుతున్న తరుణంలో మెగాస్టార్ చిరంజీవి ముందస్తు చర్యగా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్ వాయిదా పడింది. కరోనా లక్షణాలు లేకపోయినా అది వచ్చిన వాళ్ళు కనీసం రెండు నెలల పాటు ఇంటి పట్టున ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఆచార్య టీం రెండు నెలల వరకు షూటింగ్ ప్రారంభించే అవకాశం లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం.
Tags: #Acharya #Chiranjeevi #Cinecolorz