
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ కాలం కలిసి రాక కరోనా రావటంతో ఆలస్యం అయింది. అయితే అన్ని సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి కానీ ఆచార్య ది మాత్రం రావట్లేదని చిరు స్వయంగా రంగంలోకి దిగి శివతో మిమ్ లు చేసారు. 'ఏమయ్యా శివ, నువ్వు అప్డేట్ ఇస్తావా లేదా నన్ను లీక్ చేయమంటావా' అంటూ చమత్కారాలు ఆడారు. అంతే ఈరోజు ఆచార్య టీజర్ పై అప్డేట్ ఇచ్చారు కొరటాల శివ. జనవరి 29న 4 గంటల 5 నిమిషాలకు టీజర్ ధర్మస్థలి తలుపులు తెరుచుకుంటాయని ట్వీట్ చేశారు. సో, మరో రెండు రోజుల్లో ఆచార్య రచ్చ మొదలవుతుంది.