
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆచార్య' ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒక మెగాస్టార్ హీరో అవ్వడం అయితే మరొకటి కొరటాల శివ దర్శకత్వం అందులోనూ రామ్ చరణ్ స్పెషల్ రోల్ లో నటించడం. మరి ఇన్ని ఆసక్తిరేపే విషయాలు ఉన్నాక ఎదురుచూడకుండా ఉండగలరా? అయితే కరోనా కారణంగా ఆచార్య షూటింగ్ మరియు రిలీజ్ ఆలస్యం అయ్యింది. తాజాగా జనవరి 26న టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో మెగా అభిమానులకు ఊహించని సర్ప్రైజ్ లభించింది. ఇక మరో 5 రోజుల్లో ఆచార్య హంగామా మొదలు కానుంది.