
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నెమ్మదిగా తనదైన ముద్ర వేస్తున్న నటుడు జాన్ కొట్టోలీ కన్నుమూశారు. అతని మరణానికి కారణం ఇంకా బయటకు రాలేదు కానీ, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అతని నివాసంలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం ప్రగతినగర్లో ఆయన తుది శ్వాస విడిచారు. కేరళకు చెందిన జాన్ కొట్టోలి, 'మను', 'యుధమ్ శరణం', 'మహానటి', 'సమ్మోహనం', 'ఫలక్నుమా దాస్' సహా పలు వెబ్ సిరీస్ మరియు తెలుగు సినిమాల్లో పనిచేశారు. జాన్ కోటోలీ చివరి వెంచర్ ‘గాడ్’ అనే తెలుగు వెబ్ సిరీస్. అతను తరువాత నాచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు నటిస్తున్న హై-హైప్డ్ చిత్రం 'V' లో కనిపించనున్నారు. జాన్ కొట్టొలీ మరణ వార్త తెలుసుకున్న తెలుగు సినీ ప్రముఖులు కొందరు అతనికి నివాళులు అర్పించారు.