
లాక్డౌన్ సమయంలో యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ తన లేడీలవ్ డాక్టర్ పల్లవి వర్మను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నిఖిల్ ఓ ప్రోగ్రాంలో చెప్పిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. నిఖిల్ కు అప్పుడే పాప కూడా ఉందా అంటూ గుసగుసలు అడ్డుకుంటున్నారు. ఇంతకీ సంగతేంటంటే నిఖిల్ సిద్ధార్థ్ మరియు అతని భార్య పల్లవిలకు పిల్లలు పుట్టడానికి చాలా సమయం ఉంది. కాని అప్పుడే వారికి పుట్టబోయే పాప పేరు ఎం పెట్టాలో నిర్ణయించేశారు. వారికి అమ్మాయి పుడితే మాయ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారట. నిఖిల్ కు 'మాయ' అనే పేరు చాలా ఇష్టమట అందుకే వారు ప్రేమలో ఉన్నప్పుడే ప్రేయసి పల్లవికి కూతురు పుడితే మాయ అని పెట్టాల్సిందేనని తేల్చి చెప్పాడట.