
సౌత్ చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన ఎవర్ గ్రీన్ బ్యూటీ నటి ఖుష్బూ సుందర్ తృటిలో పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఖుష్బూ తన ట్విటర్ ద్వారా తెలియజేసారు. 'నా కారుకు మేల్మర్వార్తు దగ్గర యాక్సిడెంట్ అయింది. అదృష్టవశాత్తు నాకు ఏమి కాలేదు. అభిమానుల మరియు దేవుడి ఆశిశుల కారణంగా నేను సురక్షితంగా తప్పించుకున్నాని' తెలిపారు. అలానే మీడియాకు ఇది తమ కారు వల్ల జరిగిన యాక్సిడెంట్ కాదని తాము సరైన దారిలో వెళ్తుండగా సడన్గా ఒక ట్యాంకర్ వచ్చి గుద్దినదని వేరే వేరే కధనాలు పుట్టించొద్దని స్పష్టం చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలిసులు ముందుగా ఖుష్బూ కారు డ్రైవర్ ను విచారించారు. ఇది చుసిన ఖుష్బూ అభిమానులు తృటిలో తప్పించుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.