
కోలీవుడ్ హీరో అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు ఆది పినిశెట్టి. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ తో సమానంగా నటించి మెప్పించాడు. అయితే తాజాగా ఆది పెళ్లి కబురు జోరుగా ప్రచారం అవుతుంది. తనతో పాటు రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నిక్కీ గల్రానిను పెళ్లాడనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. అసలే టాలీవుడ్ లో పెళ్లి గంటలు వరుసగా మోగుతున్న తరుణంలో ఇప్పుడు మరో హీరో పెళ్లి వార్త రావటంతో కరోనా కష్టకాలంలో ఈ శుభవార్తలు వినిపిస్తున్నాయి. ఆది పినిశెట్టి తండ్రి రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుకలకు కూడా నిక్కీ హాజరైంది. అయితే, ఈ వార్తలపై ఇంతవరకు ఆది కానీ, నిక్కీ కాని స్పందించలేదు.