
కోలీవుడ్ సినిమాతో పరిచమైన హైదరాబాద్ అమ్మాయి అదితి రావ్ హైదారి ఆ తర్వాత బాలీవుడ్, మాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018 లో సుధీర్ బాబు హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సమ్మోహనం' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది. ఈ చిత్రంలో అదితి నటనకు ప్రేక్షకుల నుంచే కాక విమర్శకుల నుంచి కూడా ప్రసంశలు దక్కాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో అంతరిక్షం, నానితో వి సినిమాల్లో నటించింది. అయితే అదితి ఇన్నేళ్ళుగా ఒక విషయాన్నీ బయటపెట్టకుండా సీక్రెట్ గా మైంటైన్ చేస్తూ వస్తుంది. ఇన్నాళ్లు సింగిల్ అని భావించిన అదితికి పెళ్లి అయ్యి 8 ఏళ్ళు అయింది. 2009 లో బాలీవుడ్ నటుడు సత్య దీప్ మిశ్రా అనే అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన కొన్ని ఏళ్లకు గొడవలు రావటంతో 2013 లో భర్తతో విడాకులు తీసుకొని కెరియర్ పై ఫోకస్ పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు.