
కరోనా సెలెబ్రెటీలకు ఎందుకు, ఎలా వస్తుంది? అని అనుకున్న వారికి అమితాబ్ బచ్చన్ కుటుంబానికి రావడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, ఎక్కడికి వెళ్లిన పకడ్బందీగా వెళ్తారు అటువంటి వారికి ఎందుకు వస్తుందిలే అని అనుకున్న వారికి భారీ షాకే తగిలింది. షూటింగ్లు మొదలయ్యే సరికి మెల్లి మెల్లిగా ఒకొక్కరికి కరోనా వ్యాపిస్తుంది. టీవీ షూట్ చేసినందుకు అమితాబ్ బచ్చన్ కు, సిరీస్ షూట్ కు వెళ్లిన అభిషేక్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ రాగా, అభిషేక్ బచ్చన్ ను షూట్ నుంచి ఇంటికి తీసుకురావటంతో ఐశ్వర్య రాయ్ కు కరోనా పాజిటివ్ అని తెలింది. ఐశ్వర్య రాయ్ కూడా కరోనా భారిన పడటంతో సోషల్ మీడియా ఒక్కసారిగా ఉల్లికి పడింది.