
ఎట్టకేలకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్గన్ హైదరాబాద్ వచ్చారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సేట్స్లో జాయిన్ అయ్యారు. అజయ్ దేవ్గన్ ఈ రోజు నుండి రాజమౌళి ఆర్ఆర్ఆర్ షూట్ లో పాల్గొననున్నారు.
సినిమాను నిర్మిస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు అజయ్ దేవ్గన్ సెట్స్ లో జక్కన్నకు హ్యాండ్ షేక్ ఇస్తున్న చిత్రాన్ని పంచుకోవడం ద్వారా దాన్ని ధృవీకరించారు. ఈ సందర్భంగా రాజమౌళి ట్విట్టర్లో “మేము అజయ్ దేవగన్ తో సూపర్ షెడ్యూల్ ప్రారంభించడానికి రెడీ అయ్యాము" అని ట్వీట్ తో పాటు ఓ ఫోటోను షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో నేటింటా వైరల్ అవుతుంది. ఇకపోతే టాలీవుడ్ బడా స్టార్లు రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ స్వాతంత్ర్య సమరయోధులుగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ ను జులై 30న రిలీజ్ చేస్తామని చెప్పినప్పటికీ షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో అక్టోబర్ కు పోస్ట్ పోన్ కానున్నట్లు సమాచారం.