
బిగ్ బాస్ సీజన్ 4 హైలైట్ గా నిలిచే ఒక్క టాస్క్ లేదా ఒక్క ఘటన చెప్పలేము కానీ ప్రతి వారంలో ఎలిమినేషన్ కన్నా నామినేషన్ ఎపిసోడ్ కే అత్యధిక టిఆర్పి వస్తుంది. నామినేషన్ల ప్రక్రియలో ఒకరినొకరు తిట్టుకునే అంశం నెటిజన్లకు నచ్చేస్తుంది. ఈనేపధ్యంలో నిన్న నామినేషన్ల ప్రక్రియ చాలా వాడివేడిగా సాగింది. మరి ముఖ్యంగా అఖిల్, అభిజీత్ మధ్య గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అఖిల్ నేను మేకలాగ వెళ్లి పులి లాగా వచ్చి కెప్టెన్ అయ్యాను అన్న మాటకు అభిజీత్ నువ్వు పులి కాదు బలిచ్చే మేకవి అంటూ కౌంటర్ వేసాడు. ఇలా ఒకటి కాదు మాటకు మాట అభిజీత్ ఇచ్చిపడేసాడు. దీంతో అభిజీత్ మాస్ అంటూ సోషల్ మీడియాలో మిమ్లు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్స్ లో అభిజీత్, హారిక, లాస్య, మోనాల్, అరియానా, సోహెల్.