
అక్కినేని వారసుడు అఖిల్ 'అఖిల్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు తనని తాను నటన పరంగా నిరూపించుకెందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా ఒక మంచి హిట్టు కూడా అతని ఖాతాలో పడలేదు. అయినా సరే సినిమాలు మాత్రమే బాగానే వస్తున్నాయి. అఖిల్ నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' థియేటర్ల తెరవగానే రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈలోపే మరో సినిమాకు సైన్ చేసాడు ఈ కుర్ర హీరో. 'సైరా' లాంటి భారీ బడ్జెట్ సినిమాతో భారీ హిట్ కొట్టిన దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ హీరోగా ఒక సినిమా చేయనున్నారు. దీన్ని అక్కినేని హీరో స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. అయితే సురేందర్ రెడ్డి అంటేనే ఓ మోస్తరు బడ్జెట్ సినిమా ఉహించచ్చు. మరి అఖిల్ కు ఉన్న మార్కెట్ ను ద్రుష్టిలో పెట్టుకొని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. వక్కంతం వంశీ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సురేందర్ 2 సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రానున్నాయి.