
అఖిల్ అక్కినేని వివాహానికి సంబంధించిన ఉహాగానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త కుమార్తెతో అఖిల్ నిశ్చితార్థం త్వరలో జరుగబోతుందని తెలుస్తోంది. అఖిల్ వదిన సమంతా అక్కినేని ఈ సంబంధాన్ని పర్యవేక్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందిలో ఎంత వరకు నిజముందో తెలియదు కాని అఖిల్ నిశ్చితార్థానికి సంబంధించి అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం వేచి చూద్దాం. ఇకపోతే అఖిల్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు చెప్పుకోదగ్గ హిట్ లేదు. అతని చివరి చిత్రం మజ్ను కూడా అంతంతమాత్రంగానే ఆడింది. దీంతో తదుపరి సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని పరితపిస్తున్నాడు. ప్రస్తుతం పూజ హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో నటిస్తున్నాడు.