
అఖిల్ అక్కినేని నటిస్తున్న 4వ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అఖిల్ కు ఇప్పటి వరకు సరైన హిట్ లేకపోవడంతో చాలా గ్యాప్ తీసుకోని సరైన కధ కోసం ఎదురుచూసి ఈ సినిమాకు ఓకే చెప్పాడు అఖిల్. షూటింగ్ ముగింపు దశలో ఉన్న చిత్ర టైటిల్ ను నిర్మాతలు తాజాగా విడుదల చేశారు. ఈ మూవీకి "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" అని టైటిల్ పెట్టారు. కొద్ది సేపటి క్రితం అఖిల్ అక్కినేని టైటిల్ లోగోను తన ట్విట్టర్లో విడుదల చేశాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ 2020 ఫిబ్రవరి 8న విడుదల కానుందని అఖిల్ వెల్లడించారు. రొమాంటిక్ డ్రామగా తెరకెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా...ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ సాధించిన అఖిల్, గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంపై తన ఆశలన్నింటినీ పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని ఎన్ఆర్ఐ-కిడ్ పాత్రలో కనిపించనున్నారు.