
అల్లు అర్జున్ తో తీసిన 'డీజే' బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఆ సినిమా తర్వాత హరీష్ శంకర్ తన తాజా 'గడ్డలకొండ గణేష్'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం హిట్ అయినప్పటికీ, తన కెరీర్లో ఇంత గ్యాప్ ఎలా వచ్చిందనే దానిపై దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడు. దర్శకుడు వేగంగా సినిమాలు చేయాలనుకుంటున్నాడు కానీ కొన్ని ఆయన చేతిలో ఉండవు. అందుకే డీజే తర్వాత భారీ గ్యాప్ వచ్చింది. దీంతో కనీసం గద్దలకొండ గణేష్ తర్వాత ఎక్కువ సమయం తీసుకోకూడదని దర్శకుడు నిర్ణయించుకున్నాడు. గద్దలకొండ గణేష్ రిలీజ్ అయ్యి ఇప్పటికే 4నెలలు కావొస్తుంది కానీ ఇంతవరకు హరీష్ తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. స్టార్ హీరోలతో చేయాలంటే ఇంకో సంవత్సరం ఆగాల్సిన పరిస్థితి. అందుకే మీడియం హీరో అక్కినేని నాగచైతన్యతో చేద్దామంటే చై కూడా మరో 6 నెలలు బిజీగా ఉన్నాడు. అందుకని అతను ఇప్పుడు హిట్ కోసం చూస్తున్న అక్కినేని అఖిల్ ను సంప్రదించాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ చిత్రం మినహా మరే ఇతర చిత్రానికి అఖిల్ అంగీకరించలేదు. కాబట్టి హరీష్ శంకర్ ఇప్పుడు అఖిల్‌తో కలిసి పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.