
అక్కినేని వారసుడు అఖిల్ సినిమాలు అయితే చేస్తున్నాడు కానీ ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేదు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. చాలా కాలం చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. తాజా సమాచారం మేరకు యూఎస్ నుంచి పెళ్లి చేసుకోవాలని వచ్చిన అఖిల్ పెళ్లి కూతురును ఎలా వెతుకుతాడు ? అనే దానిపై కధ నడుస్తుందట. సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే తెలియనున్నాయి. బొమ్మరిల్లు భాస్కర్ లవ్ స్టొరీలను ఎంతో అందంగా తెరకెక్కిస్తాడు....మరి అఖిల్ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలి అంటే కాస్త సమయం వేచి చూడాల్సిందే. ఇకపోతే బొమ్మరిల్లు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అఖిల్ చివరిగా నటించిన 'మిస్టర్ మజ్ను' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు అఖిల్.