
యంగ్ హీరో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరైన శర్వానంద్ 'శ్రీకారం' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అరెక్స్ 100 ఫెమ్ అజయ్ భూపతితో శర్వా సినిమా చేయనున్నాడు. ఇందులో హీరో సిద్దార్థ్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇంతేకాదు శర్వా తన 30వ సినిమాను కూడా ప్రకటించాడు. శ్రీకార్తిక్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాలో అదితి రావు హైదారి హెర్యిన్ గా నటిస్తుంది. అయితే ఇందులో అక్కినేని అమల శర్వా తల్లిగా కనిపించనున్నట్లు సమాచారం. అప్పుడెప్పుడో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో తల్లిగా నటించిన అమల మళ్ళీ ఇంతకాలానికి శర్వా సినిమాలో కనిపించబోతున్నారు. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అమల పాత్ర నాగార్జునకు అంతగా నచ్చలేదట. అందుకనే అమల కన్నా ముందు ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందో ఏంటో తెలుసుకుందామని నాగ్ నిర్ణయించుకున్నారట. మరి అమల నటిస్తారో లేదో చూడాలి.