
ప్రస్తుతం స్టార్స్ కీ యూనియన్ చాలా కామన్ గా మారింది. స్టార్ డమ్ ఉన్న యాక్టర్స్ కుటుంబాలు కలిస్తే ఇక ఫ్యాన్స్ కి పండగే. అందులోనూ టాలీవుడ్ లో అగ్ర కుటుంబంలో హీరోల కలయిక అంటే ఇంకాస్త క్రేజ్ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది సంక్రాంతి పండుగను మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ సెలెబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో కింగ్ నాగార్జున అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా పండుగ విందు కార్యక్రమంలో పాల్గొంటూ కుటుంబంతో కలిసి పండుగ సెలెబ్రేట్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జునతో సహా, మెగా ఫ్యామిల హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్. సాయితేజ్, అల్లు శిరీష్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.