
అక్కినేని వారి కోడలు సమంత మామనాగార్జున బాధ్యతను తీసుకొని బిగ్ బాస్ 4 దసరా మహా ఎపిసోడ్ హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా 'ఆహా' ఓటిటిలో 'సామ్ జామ్' అనే టాక్ షోకు సమంత హోస్ట్ గా మారారు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా వెల్లడించిన సమంత బిగ్ బాస్ గురించి అడిగినప్పుడు దాని గురించి సమాధానమిస్తూ.....నాకు మా మామ నువ్వు హోస్ట్ గా చెయ్యాలి అన్నప్పుడు భయమేసింది. నేను చెయ్యలేను అంటే లేదు నువ్వు చేస్తావని నా మీద నమ్మకం పెట్టుకున్నారు. అందుకనే ఆ నమ్మకం నిలబెట్టుకోవడం కోసమే అంగీకరించాను. ఒప్పుకున్నాను కాబట్టి నా బెస్ట్ ఇచ్చాను. ఆ షో గురించి విన్నాను కానీ చూడలేదు. హఠాత్తుగా హోస్ట్ గా చేయాల్సి రావటంతో మూడు రోజులు వరసగా కూర్చొని అప్పటి వరకు జరిగిన ఎపిసోడ్లన్నీ చూసాను. నాకు తెలుగు అంత స్పష్టంగా రాదు కాబట్టి పదాలు బట్టి పట్టానని సమంత వెల్లడించారు. మూడు గంటల షోకు ఒప్పుకునేందున మామకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం సమంత ఇంత కష్టపడిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.