
తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ ఇప్పటికి నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. కరోనా కూడా బిగ్ బాస్ ను ఆపలేకపోయింది. అయితే అప్పటి వరకు పెద్దగా తెలియని మొహాలు బిగ్ బాస్ తర్వాత మాత్రం సెలెబ్రిటీలుగా మారిపోతున్నారు. ఈ సీజన్ లో సోహెల్ ఎలానో గత సీజన్ లో అలీ రెజా అలా. సీరియల్స్ లో నటిస్తూ అడపాదప కనిపించే వీళ్లు ఇప్పుడు సెలబ్రిటీలు అయ్యారు. బుల్లి తెర అర్జున్ రెడ్డి, యాంగిరి మ్యాన్ అంటూ ట్యాగ్స్ పొంది మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. క్రేజ్ తో పాటు అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. అలీ రెజా షాప్ ఓపెనింగ్లు, యూట్యూబ్, సినిమాలు ఇలా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అందుకే కాబోలు మొన్నామధ్య కొత్త ఫ్లాట్ తీసుకుని ఇప్పుడు తాజాగా కొత్త కార్ కూడా తీసుకున్నాడు. ఆ కారు ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలీ రెజాతో పాటు హిమజ, శివ జ్యోతి వంటి వారు కూడా ఇల్లు, కారు కొనుక్కున్నారు.