
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని అంటే తెలియని వాళ్ళు ఉండరు. చిన్నప్పటి నుంచే తన అల్లరితో ఆటపాటలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ వస్తుంది. పండగలకు శుభాకాంక్షలు, పార్టీలకు డ్యాన్స్‌లు , పుట్టినరోజులకు విషెస్ ఇలా ఏదొక యాక్టివిటీతో సితారా సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆమె డ్యాన్స్ వీడియోలకైతే భారీగా వ్యూస్ వస్తుంటాయి. అయితే సితారాకు కేవలం టాలీవుడ్ లోనే కాకా బాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు. మహర్షి సినిమా షూటింగ్ సమయంలో మహేష్ కుటుంబంతో కలిసి న్యూయార్క్ వెళ్లడం జరిగింది. అక్కడ అప్పటికే తన సినిమా నిమ్మితం ఉన్న అలియా భట్ ను సితారా కలవడం జరిగింది. అల..వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ నిమ్మితం హైదరాబాద్ వచ్చిన అలియా సితారాను కలిసి తన సొంత బ్రాండ్ దుస్తులు బహుమతిగా ఇచ్చింది. ఇదే విషయాన్నీ సితారా ఆనందంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.