
బాలీవుడ్ లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అతన్ని బాలీవుడ్ మూవీ మాఫియా మానసికంగా హింసించిందని ఆ మాఫియాలో కారం జోహార్, మహేష్ భట్ ముఖ్య పాత్రలు వహించారని విమర్శలు వినిపించాయి. అదే తరుణంలో మహేష్ భట్ కుమార్తె అలియా భట్ పై కూడా ఎన్నో విమర్శలు వినిపించాయి. ఆమెకు అందం, అభినయం లేదు కేవలం అతని తండ్రి అండతో వచ్చిందని కామెంట్లు చేసారు. అయితే తాజాగా అలియా భట్ వీటిపై స్పందించింది. 'నన్ను ఎన్నో రకాలుగా విమర్శిస్తున్నారు. దారుణమైన మాటలతో మానసికంగా టార్గెట్ చేస్తున్నారు. కానీ వారి మాటలే నాకు అశ్చిర్వచనాలు అనుకుంటా. ఈ సంఘటనలతో చాలా నేర్చుకున్నాను. ఒక మనిషితో దయతో ఉండాలని, భూమితో కూడా ప్రేమగా ఉండాలని తెలుసుకున్నాని' ఆవేదన వ్యక్తం చేసింది.