
దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' లో టాలీవుడ్ టాప్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే. 5 నెలల క్రితం రామ్ చరణ్ టీజర్ విడుదల చేసిన టీం కొద్దీ రోజుల క్రితం ఎన్టీఆర్ టీజర్ ను రిలీజ్ చేసింది. ఆ టీజర్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మెకోవర్ చూస్తుంటునే రాజమౌళి హీరోలను ఏ రేంజ్ లో చెక్కడో అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే బిటౌన్ లో హీరో సుశాంత్ సింగ్ చనిపోయిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాల వల్ల అలియా ఈ సినిమాలో నటించడం లేదని పుకార్లు పుట్టుకొచ్చాయి. వాటికి రాజమౌళి ఒక మీడియా ఇంటర్వ్యూలో చెక్ పెట్టారానుకోండి. ఇక తాజా సమాచారం ప్రకారం అలియా నవంబర్ 2న ఆర్ఆర్ఆర్ సెట్స్ లో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు అలియా కనిపించబోయే ఒక పాటను స్వయంగా ఆమెనే పాడనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్న అలియాతో జక్కన్న ఈ ప్రయోగం చేయిస్తాడా? ఏమో మరి కాలమే చెప్పాలి.