
మహేష్ బాబుతో జతకట్టనున్న అలియా భట్ అనగానే ఏ సినిమా అయుంటుందని ఆలోచిస్తున్నారా ? అది కాదు సంగతి. అసలు మ్యాటర్ ఏంటంటే...మహేష్ బాబు సోనీ పికచర్స్ తో కలిసి అడివి శేష్ హీరోగా "మేజర్" అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. 26/11 ముంబై యటాక్స్ లో మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ మేజర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ను ఒకేసారి ఇటు తెలుగులో అటు హిందీలో చిత్రీకరిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మేకర్స్ బాలీవుడ్ నటి అలియా భట్ ను ఎంపిక చేసుకునే పనిలో పడ్డారట. ఈ మేరకు అలియా భట్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. అలియా భట్ సినిమాకు మరింత హంగును తెస్తుందని భావిస్తున్నారట. మరి అలియా మేజర్ సినిమాకు సైన్ చేసి మహేష్ ప్రొడక్షన్ లో భాగమవుతుందేమో చూడాలి.