
సుదీర్ఘ గ్యాప్ తరువాత, అల్లారి నరేష్ తిరిగి హీరోగా వస్తున్నాడు. ముందు నుంచి తెలిసిన విషయమే...అల్లరి నరేష్ తన తదుపరి సినిమా కోసం నూతన దర్శకుడు విజయ్ కనకమేడలతో చేతులు కలిపాడని. అయితే అల్లారి నరేష్ నటిస్తున్న సినిమా టైటిల్ 'నాంది'ను మేకర్స్ లాక్ చేశారు. అలానే ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక నాంది ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే, గోలుసులతో కట్టేసి తలక్రిందులుగా వెల్దాతీసిన అల్లారి నరేష్ నగ్నంగా కనిపిస్తున్నాడు. అల్లారి నరేష్ నటించిన నాంది ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. ప్రేమికులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన కధగా ఇది తెరకెక్కుతుంది. ఎస్వీ2 బ్యానర్ మరియు సతీష్ వేగేశ్న ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ నటి వరలక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. అల్లరి నరేష్ చివరిగా మహేష్ 'మహర్షి' సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ హీరోగా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సినిమా నరేష్ కు సక్సెస్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.