
టాలీవుడ్ లో బాగా పేరున్న నిర్మాణ సంస్థల్లో గీతా ఆర్ట్స్ ఒకటి. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కొన్నేళ్ల క్రితం కేవలం మెగా హీరోలతో సినిమాలు తీస్తూ సేఫ్ గా ఉండేవారు. కానీ ఈమధ్యకాలంలో అల్లు అరవింద్ వేరే హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మరి ముఖ్యంగా క్రేజ్ ఉన్న హీరోలతో సినిమాలు చేస్తే సంస్థ పదికాలాల పాటు మార్కెట్ లో కళకళలాడుతూ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. మహేష్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే ప్రస్తుతం అల్లు అరవింద్ దర్శకుడిని వెతికే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ పరుశురాంను సెట్ చేద్దాం అనుకుంటే అతను చెప్పిన కథకు మహేష్ ఇంప్రెస్ అవ్వలేదు. దీంతో మరో డైరెక్టర్ ను వేటాడే పనిలో పడ్డారు. కొందరు తమిళ దర్శకులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరి మహేష్ కోసం ఏ డైరెక్టర్ ని ఫైనల్ చేస్తారో చూడాలి.