
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం "అల..వైకుంఠపురములో" సినిమా నాన్ బాహుబలి రికార్డులను సాధించి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా, అల్లు అర్జున్ కెరియర్ లోనే అత్యంత వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమా సాధించిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న అల్లు అర్జున్, అదే జోష్ తో సుకుమార్ తో తెరకెక్కనున్న తన తదుపరి సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. అయితే, ఇదిలావుండగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కుటుంబానికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. అలా, తాజాగా కూతురు అల్లు అర్హతో పెట్టిన ఒక వీడియో చూసిన వారంతా పగలబడి నవ్వితున్నారు. ఈ వీడియోలో అర్హ అల్లు అర్జున్ ను "బే" అంటూ ముద్దుముద్దుగా పిలుస్తూ నెటీజన్లను ఆకట్టుకుంటుంది. "కన్న తండ్రిని, ఓన్ ఫాదర్ ని బే అంటావా, బే అని అల్లు అర్జున్ అర్హను అడిగితే...దానికి ముద్దు ముద్దుగా అవును బే" అని అర్హ చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.